Sri Dakshinamurthy Chalisa || Dakshina Murthy Songs || My Bhakti tv

1,750,479
0
Published 2023-02-20
Title: Sri Dakshinamurthy Chalisa || Dakshina Murthy Songs || My Bhakti tv
Lyrics: Trinadh Murthy Jarajapu
Composed by: Sivala Raghuram
Singer: Mula Srilatha
#devotionalchants
#dakshinamurthysongs
#dakshinamurthy
Produced by: B.N Murthy & Palli Nagabhushana Rao
Published By : Musichouse
Recorded at Sri Matha Digital Recording Studio, Visakhapatnam. (8106766133)
సకలలోకముల గురువితడు
సర్వరోగముల వైద్యుండు
సకలవిద్యలకు నెలవైన
దక్షిణామూర్తి వందనము

చిత్రముగా వటవృక్షము నీడను
యువకుడైన గురువర్యుని ముందు
భక్తిశ్రద్ధలతొ వృద్ధశిష్యులు
మౌనముగా గురుబోధనము

మౌన వ్యాఖాన పఠిమలతో
ప్రకటిత బ్రాహ్మ స్వరూపముతొ
ప్రసన్నవదనం బ్రహ్మ నిష్టతొ
చిన్ముద్రాంచిత హస్తముతొ
ఆచార్యేంద్రులు మహాఋషులకు
ఆత్మవిద్యను బోధించే
ముదితవదన శ్రీదక్షిణామూర్తి
మునుముందుగ మాఅత్మనివేదన

వటవృక్ష సమీపంలో
మహాఋషులకు మునిపుంగవులకు
బ్రహ్మవిద్యను దానంచేసిన
త్రిభువనములకు గురుదేవుండు
జనన మరణములు దు:ఖదురితములు సంసారసింధు బంధములు
జయించు మార్గప్రభోదకుడు
దక్షిణామూర్తి దేవదేవుడు

ప్రసన్నమైన స్వరూపము
మూర్తిమంతమగు శుద్ధజ్ఞానము
ప్రణవనాదమగు ఓంకారంలా
భాసించే లక్ష్యార్ధము
ఈశ్వరుడు గురువు ఆత్మలకు
భిన్నమైన త్రిమూర్తిరూపం
ఆధ్యాత్మిక ఆకాశమునంతా
వ్యాప్తిచెందిన నిర్మలదేహం

చరాచరమైన మహాజగత్తు
మర్మముతెలిపిన యోగిపుంగవుడు
మాయాశక్తితొ జగన్నాటకం
స్వేచ్చగనడిపే మహాత్ముడు
నిత్యసత్యమై ప్రకాశించిన
వ్యక్తరూపమున జగత్ స్పురణం
భక్తిశ్రద్ధలతొ శరణువేడిన
జ్ఞానబోధనం చేసిన విభుడు

మహాకైలాస సదనమె నిలయం
వామభాగమున కళత్రదేహం
కోటిమన్మధుల సమ లావణ్యం
హిమవంతుని సుత మానసచోరం
రత్నవైడూర్యమౌక్తిక మకుటం
మందాకిని జలమిమిడిన శిరజం
చంద్రవంక శిగనమరిన చందం
నుదుటను విభూది రేఖల అందం

సూర్యచంద్రాగ్ని లోచనములుగ
తక్షవాసుకి కుండలములుగ
సుందర ప్రసన్న వదనంతొ
జలదోద్భవ ఓ గరళ కంధరా
కురంగ విలసిత హస్తాంబుజము
కరకమలమున దివ్యపరశువు
వరదాభయ ప్రద కరయుగళం
అమితరత్న మాణిక్య హారము

మౌక్తిక స్వర్ణ రుద్రాక్షమాలిక
హిరణ్య కింకిణి యుక్త కంకణం
మందార మల్లిక హార భూషితం
మత్తమాతంగ సత్కృతివసనం
వైకుంఠనాధ విలసత్సాయక
స్వర్ణఖచితమౌ శైలమె ధనువుగ
విలసిత బుజంగరాజు మాలగ
సహస్రభాను సంకాశప్రకాశక

అగ్నినేత్రముతొ త్రిపురాంతకము
జలంధరాసుర శిరచ్ఛేదము
నరకాధిపతి దర్పనాశక
మార్కండేయ అభీష్టదాయక
సమస్తలోక గీర్వాణ శరణ్య
మన్మదాంతక మాంగళ్యదాత
దక్షసవన విఘాత నాయక
సనకాది మునిసేవిత

ఘోరపస్మార ధనుజ దమనకా
అనంత వేదవేదాంత సంవిద
ఉపమన్యు మహామోహనాశక
బ్రహ్మవిష్ణు సంగ్రామ నివారక
నాగేంద్రమె యజ్ఞోపవీతము
సౌదామిని సమకాంతి శిరోజము
జలదరించు మణిమంజీర చరణం
హిమవంతుని సుత సేవిత చరణం

పంచాక్షరి మంత్ర స్వరూపము
సహస్రకోటి సూర్యతేజము
అనేకకోటి చంద్ర ప్రకాశము
కైలాసతుల్య నందివాహనం
జరామరణ ప్రారబ్ధ మోచక
సంసార సాగర దు:ఖ విమోచక
బ్రహ్మాది అణు పర్యంత వ్యాపక
ధర్మార్ధ కామకైవల్య సూచక

సృష్టిస్థితి సంహార కారక
అనంతకోటి బ్రహ్మాండనాయక
విశ్వనాశ కల్పాంత భైరవా
తాండవకేళీ చతుర కోవిద
రజోస్తమసత్వ అతిశయ కారక
శాశ్వతైశ్వర్య వైభవ కారక
సకల దేవతారాద్య ప్రేరక
అఖండ సచ్ఛిదానంద విగ్రహ

దర్మార్ధకామ మొక్షములొసగి
సర్వక్లేశములు శమియించి
అజ్ఞానమును పారద్రోలి
సన్మంగళములొసగు పరమాత్మ
తమకోరికలు ఈడేర్చ
దేవంతలందరు సేవించే
నారదాదులు ఆరాదించిన
జ్ఞానప్రదాత దక్షిణామూర్తి

సంసారబంధ విమోచనకై
సర్వప్రాణులు సురవరులందరు
భక్తి శ్రద్ధలతొ నిరతముకోలిచే
కరుణామయుడు దక్షిణామూర్తి
సన్మంగళముల నొసగే విభుడు
శాశ్వతైశ్వర్య వైభవ సహితుడు
పాదాంబుజములు కొలిచే వారికి
నిత్యము కాచే సులభ సాధ్యుడు

బ్రహ్మాదికీటక పర్యంతం
తానేయైన జగత్పాలకుడు
చరాచరములు స్థూలసూక్ష్మముల
వేదవేదాంగ విధినిర్వహుడు
ముల్లోకముల మహాచక్రములు
సందానించే మహిమాన్వితుడు
నిగమాగమముల సారము తానై
సుజనరక్షకుడు సుగమ సాధ్యుడు

భూమి అగ్ని వాయువు జలము
ఆకాశమను పంచభూతములు
భువన రూపక వరప్రదాయక
దేవకీసుత దేవేశ
అజ్ఞానతిమిర అంధకారమును
పారద్రోలిన భాస్కరుడు
అద్వైతానందవిజ్ఞానమును
స్వర్గసౌఖ్య సుజ్ఞాన ప్రదాత

అవిధ్యాధార ధర్మచింతనము
రహితమైన ఓ నిర్గుణరూప
అనంతకోటి మహామంత్రముల
నిండినరూప పరమేశ
శబ్ధస్పర్శముల రూపము నీవే
రసగంధములకు మూలము నీవే
సహజానందము సందోహములు
కలిసినతేజము నీరూపం

పుట్టుక నాశము నియంత్రణం
ఇహము పరము నీ అభీష్టము
సహస్రార పద్మమె మందిరము
అనంతానంత శరనిక్షేపము
అకారది వర్ణముల రూపము
అధిగమించు సౌభాగ్యౌదారము
మూలమంతయు నీ మహిమే
కరుణాంతరంగ నీ వరమే

నిజభక్తులకు కైవల్యం
నామస్మరణతో పరమానందం
నీ కీర్తనమే ఒకభోగం
దివ్య దర్శనం ఒక యోగం
అచింత్యమైన దివ్యమహిమల
రాగరంజితం దివ్యరూపము
అనిత్యమైన దేహభ్రాంతిని
తొలగించే బ్రహ్మానంద తేజం

సుకృతములకు పసన్నత
దుష్కర్ములకు ప్రచండ రూపం
సంపూర్ణ తత్వజ్ఞాన విగ్రహ
ఆదిమధ్యాంత రహిత పూజిత
పరాశక్తి సమ్యుక్తా ఈశ
పరంధామ ఓ మరమేశ
మునివర పూజిత ముక్తిప్రదాత
సకలలోక పరిపాలక ఈశ

NO COPYRIGHT INFRINGEMENT INTENDED.

COPYRIGHT NOTICE:
Please feel free to leave me a notice if you find this upload inappropriate. Contact me personally if you are against an upload which you may have rights to the music, instead of contacting YouTube about a Copyright Infringement. Thank You, sir...
******************************************************************************************************************
My Bhakti Tv channel does not support any illegal activities these videos are only for video log and Entertainment and giving Updates purposes please share this to your family and friends also like and comment.

All Comments (21)
  • తల్లీ, నీ గొంతులో మాధుర్యం, మార్ధవం, ఆర్ద్రత, నీవు గానం చేసిన విధానం, నాకెంతో ఆనందం కలిగించాయి. నీకు ఆ దక్షిణామూర్తి స్వామివారు ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, దీర్ఘాయువు కలుగజేయు గాక.
  • @user-wv5xh3pj7g
    Swamy shop baga nadavali thanri na bartha badyathaga marali thanri kapadu Swamy om namo na mahal 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤜
  • ఓం శ్రీ దక్షిణామూర్తి స్వామి 🙏🌺🌼🌹🌸🌼🌺🙏🍌🥥🍌🍓🍎🥭❤️😘😊
  • ఓం శ్రీ మేధా దేవి సహిత దక్షిణామూర్తి యే నమః 🙏🙏🙏🙏 భూగర్భ జలాలు నిండుకుండలా ఉండేట్లు చూడు తండ్రి 🙏🙏🙏🙏 లోక జ్ఞానాన్ని, వివేకాన్ని, వాక్చాతుర్యాన్ని,సమయ స్పూర్తి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని ప్రసాదించండి తండ్రి 🙏🙏🙏🙏 మిమ్మల్ని నమ్ముకున్నాను తండ్రి, మీరే దారి చూపండి తండ్రి 🙏🙏🙏🙏 మీపై భారం వేస్తున్నాను తండ్రి 🙏🙏🙏🙏
  • చాలా మంచిగా సంగతులు పలికారు మీ ధ్వని కూడా చాలా బాగుంది చాలా బాగా పాడారు జై దక్షిణామూర్తియే నమః
  • @user-ut2mw2un4k
    నా జీవితంలో మర్చిపోని ఆరాధ దైవము దక్షిణామూర్తి కష్ట నష్టాల్లో ఉన్న ఆదుకునే మూర్తి దక్షిణామూర్తి
  • గురువు లకె గురువైనాగురుదక్షీణామూర్తీగురువులకు అనంతనంతకోటీవంధనములుతండ్ఱి
  • @user-ut2mw2un4k
    ఓం శ్రీ గురు దక్షిణామూర్తి ఏ నమః ఓం దక్షిణామూర్తి నమః వాసుదేవాయ నమః
  • గురవే సర్వ లోకానాం భిషజే భవ రోగినామ్ నిధయే సర్వ విధ్యానాం దక్షిణామూర్తయే నమః !!
  • దక్షిణ మూర్తి కి ప్రతి క్షణం మనస్ పూర్తి గా వందనము హృదయ వందనం మనసు వందనం దేహ వందనం
  • చాలా బాగా పాడావ్ అమ్మ దక్షిణామూర్తి స్తోత్రము ఓం భాస్కరాయ నమః ఓం ఓం దక్షిణామూర్తి నమః హ దక్షిణామూర్తి అంటే మన జీవితంలో వెలుగు నింపే వాడే ఆ ఆ దక్షిణామూర్తి జై శ్రీరామ్
  • @meenamuktheswar
    ప్రతిరోజు దక్షిణామూర్తి.చాలీసా వింటే.... చాలా వరకు మనసు శాంతిగా ఉంటుంది..😂😊🙏🌹🌹 పదే,పదే వినడం భక్తి మార్గంలోని సంతోషానికి స్వాగతం.. గాయకురాలి గాత్రంలోని మధురం😂 .. భక్తి భావాలకు రూపం.. 👌👌
  • జైగురుదేవ్. సత్యనారాయణ స్వామి హిందూపురం🎉 జగత్తుకే ఆదిగురువైన శ్రీ దక్షిణామూర్తి చాలీసా భక్తి నిండిన హ్రుదయం తో పాడిన గాయనికి కృతజ్ఞతలు.🎉🎉🎉
  • @Shiva9Ramesh
    ఓం నమో శ్రీ గురుభ్యోన్నమః
  • @shobhak1401
    అమ్మ శేత కోటి వందనాలు ,
  • @GVReddy-sn8mm
    ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
  • @Vastuastromnk
    చాల బాగా పాడారు మీకు శతకోటి వందనాలు జై శ్రీ రామ్
  • @Shiva9Ramesh
    ఓం నమో శ్రీ గురు దక్షిణామూర్తయే నమః
  • @dvssaraswathi9994
    దక్షిణామూర్తి నమస్కారము. ఈ పాట వింటూ ఉంటే ఎంతో ఆనందం కలుగుతుంది.